జొమాటోలో సెకెనుకు 3 బిర్యానీ ఆర్డర్లు!

జొమాటోలో సెకెనుకు 3 బిర్యానీ ఆర్డర్లు!
  • సుమారు 9.13 కోట్ల ఆర్డర్లతో లిస్ట్‌‌లో టాప్‌‌ 

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతీ సెకెనుకు మూడు బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని,  సుమారు 9.13 కోట్ల బిర్యానీ  ఆర్డర్లు అందుకున్నామని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో పేర్కొంది. 2024 లోని పాపులర్ వంటకాల వివరాలను ప్రకటించింది. ఈ లిస్టులో పిజ్జా సెకెండ్ ప్లేస్ దక్కించుకుంది.  సుమారు 5.84 కోట్ల ఆర్డర్లు ఈ వంటకం కోసం వచ్చాయి. ఈ పిజ్జాలన్నింటినీ ఒకదాని పక్కన మరొకటి పెడితే ముంబై నుంచి  న్యూయార్క్ వరకు లైన్‌‌ ఉంటుంది. ఈ ఏడాది టీ, కాఫీ మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. జొమాటోలో టీ కోసం 77.76 లక్షల ఆర్డర్లు వచ్చాయి.   కాఫీ కోసం 74.32 లక్షల ఆర్డర్లు వచ్చాయి. 

స్పెషల్ ఆర్డర్లు

ఈ ఏడాది అందుకున్న ఆర్డర్లలో ఒకటి మాత్రం స్పెషల్‌‌గా నిలిచిందని జొమాటో పేర్కొంది. ట్రైన్‌‌ బోగీలోని అందరికి ఫుడ్ అందించేందుకు ఓ కస్టమర్ ఏకంగా 120 మంచూరియా కాంబోలను ఆర్డర్ చేశాడని తెలిపింది. ఢిల్లీకి చెందిన ఓ కస్టమర్‌‌ ఈ ఏడాది‌‌ మొత్తం 1,377 రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టాడు. జొమాటో గోల్డ్‌‌ మెంబర్‌‌‌‌షిప్‌‌ కార్డుతో డెలివరీ, డైనింగ్‌‌పై  ఒక కస్టమర్‌‌‌‌ రూ.2,24,591 ఆదా చేశాడు. ముంబైతో పోలిస్తే ఢిల్లీలోని కస్టమర్లు 25 రెట్లు ఎక్కువ పానీపురి ఆర్డర్ చేశారు.

బ్లింకిట్‌‌లో ఇవే..

క్విక్‌‌కామర్స్ ప్లాట్‌‌ఫామ్‌‌ బ్లింకిట్‌‌లో  ఈ ఏడాది 1.85 కోట్ల  కోక కోలా క్యాన్‌‌ల కోసం ఆర్డర్స్ వచ్చాయని  జొమాటో ప్రకటించింది. థంబ్స్​ అప్‌‌ బాటిల్స్  కోసం 84 లక్షల ఆర్డర్లు, మాజా బాటిల్స్ కోసం 14.15 లక్షల ఆర్డర్లు, స్ప్రైట్ బాటిల్స్ కోసం  14.57 లక్షల ఆర్డర్లను బ్లింకిట్‌‌ అందుకుందని  పేర్కొంది.   కండోమ్స్​ను ఎక్కువగా ముంబైలోని కస్టమర్లు ఆర్డర్ చేశారు. ఒకే ఆర్డర్‌‌‌‌లో ఒక కస్టమర్ 55 బాటిళ్ల ఫెవికాల్‌‌ను ఆర్డర్ చేశాడు.