ఒకే చితిపై మూడు శవాలు

రాష్ట్రంలో కరోనా తీవ్రతకు, మరణాలకు ఈ ఫొటో అద్దం పడుతోంది. వరంగల్లో గురువారం ఒకే చితిపై మూడు శవాలను ఉంచి కాల్చేశారు. పక్కనే మరో రెండు చితులపై మూడు మూడు చొప్పున మరో ఆరు శవాలను కూడా దహనం చేశారు. వరంగల్‍ ఎంజీఎం కొవిడ్‍ వార్డు లో నాలుగైదు రోజులుగా తొమ్మిది శవాలు ఉండిపోవడంతో వాటికి ఇలా అంత్యక్రియలు నిర్వహించారు.. రాష్ట్రంలో కరోనా సివియారిటీని చెప్పేందుకు ఈ ఫోటోను మీ ముందుకు ఉంచాల్సి వచ్చింది.