బంజారాహిల్స్‌లో అగ్ని ప్ర‌మాదం.. తగలబడ్డ కార్లు

హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో  అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న మూడు కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.