ఆడుకుంటూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

ఆడుకుంటూ  నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మైలపల్లి రాచపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఏప్రిల్ 11న సాయంత్రం ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిన చిన్నారులు రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. నీటికుంటలో పడినట్లు గుర్తించిన స్థానికులు  వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే  చిన్నారులు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. 

మృతులు  ఏడేళ్ల వయుసు లోపు ఉన్న రాజుదేవ, రాజుజయ,యశ్వంత్ గా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీనరవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.