వరంగల్, కాశిబుగ్గ, వెలుగు: ఒక్క సెలవు దినం.. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అభంశుభం తెలియని పిల్లల ప్రాణాలను బలిగొని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ బడులకు సెలవు కావడంతో ముగ్గురు చిన్నారులు చెరువులో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని 11వ డివిజన్పరిధి క్రిస్టియన్ కాలనీకి చెందిన బరిగెల అర్పిత -సుందర్రాజు, ఆకినెపల్లి శ్రీలత- రాజ్‌కుమార్, విప్ప ఆశాదేవి- రాములు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అర్పిత సుందర్రాజు కూతురు రుచిత(5) స్థానిక ప్రభుత్వ బడిలో రెండో తరగతి చదువుతుండగా.. శ్రీలత రాజ్‌కుమార్‌ల కుమారుడు ధనధీర్(9), ఆశాదేవి రాములు కుమారుడు ప్రణీత్(9) గ్రేన్ మార్కెట్స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నారు. అర్పిత, ఆశాదేవి అక్కచెల్లెల్లు కావడం.. అందులోనూ పక్కపక్కనే నివాసం ఉంటుండటంతో వారి పిల్లలు రుచిత, ప్రణీత్ నిత్యం కలిసి ఆడుకునేవారు. వీళ్ల ఇంటి పక్కనే ఉండే ధనధీర్ కూడా వీరితో జతకట్టేవాడు. గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం అన్ని ప్రభుత్వ బడులకు సెలవు కావడంతో ఉదయం ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ పక్కనే గొర్రెకుంట క్రాస్ 2వ డివిజన్ పరిధిలోకి వచ్చే కట్టమల్లన్న చెరువు సమీపంలోకి వెళ్లారు. స్నానానికని చెరువులోకి ఒకరి తరువాత ఒకరు దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు పిల్లలు మునిగిపోయారు. దూరంగా ఉన్నవారు గమనించి అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడకు చేరుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే చిన్నారులు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపడుతూనే గీసుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కొద్దిసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఆడుకుంటూ వెళ్లి.. నీటిలో మునిగి..
- తెలంగాణం
- January 31, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ ప్రారంభోత్సవం..
- కేజ్రీవాల్, సిసోడియాలకు భారీ షాక్.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్
- OTT Telugu: ఓటీటీకి యూటిట్యూడ్ స్టార్ రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే?
- తీర్థయాత్రలకు వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి సజీవ దహనం
- చైనా మాంజా దారా తగిలి ట్రాఫిక్ పోలీస్‌కి తీవ్ర గాయాలు
- సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్ లో భారీగా పెరిగిన నాన్ వెజ్ సేల్స్..
- Oscars 2025: ఆస్కార్‌కు అంటుకున్న కార్చిచ్చు.. నామినేషన్లు జనవరి 23కు వాయిదా
- ఒకరితో ప్రేమ.. మరొకరితో అక్రమ సంబంధం.. నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్
- రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కేరళవాసి మృతి.. కేంద్రం సీరియస్
- ఎటు చూసినా బూడిదే.. ఆగని లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు.. 25కు చేరిన మృతుల సంఖ్య
Most Read News
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
- ఎటు పోతోంది ఈ సమాజం.. కోడలు కావాల్సిన అమ్మాయిని పెళ్లాడిన వరుడి తండ్రి
- Sankranthiki Vasthunnam Movie Review: సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..?
- శ్రీశైలం టోల్ గేట్ సిబ్బంది చేతివాటం : 8 మంది ఉద్యోగులపై వేటు
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- Sankranti Special : కనుమ పండుగ అంటే ఏంటీ.. ఎలా జరుపుకోవాలో తెలుసా.. !
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్‌లోనే దినేష్ కార్తీక్ బ్యాడ్ లక్
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం