నల్గొండ జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ..

నల్గొండ జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ..

నల్గొండ జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు వెంట వెంటనే జరుగుతున్నాయి. ఇటీవలే నలుగురు సీఐలను బదిలీ చేసిన మల్టీ జోన్-2 ఐజీ.. తజాగా మంగళవారం (మార్చి 11) మరో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీలలో నాంపల్లి సీఐగా ఆదిరెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆదిరెడ్డి మహబూబ్ నగర్ మల్టీజోన్ లో వెయిటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. నాంపల్లి సీఐగా ఉన్న అనంత్ నవీన్ కుమార్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు.

నల్గొండ ట్రాఫిక్ లో పనిచేస్తున్న డి.రాజు చండూర్ సీఐ గా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు చండూర్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎ.వెంకటయ్య హైదరాబాద్ కమిషనరేట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యారు.  నల్లగొండ ఎస్బి సీఐ శివ శంకర్ కోదాడ టౌన్ సీఐ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. కోదాడా సీఐగా పనిచేసిన టి.రాము హైదరాబాద్ సిటీ కమిషనరేట్ కు బదిలీ అయ్యారు.

ఇటీవలే మార్చి 8వ తేదీన  నలుగురు సీఐలు బదిలీ అయ్యిన విషయం తెలిసిందే. మిర్యాలగూడ సబ్-డివిజన్ CI లను బదిలీ చేశారు. అదే సందర్భంలో కొందరు సీఐలను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.  మిర్యాలగూడ రూరల్ CI గా PND ప్రసాద్,  మిర్యాలగూడ 1 టౌన్ CI గా మోతిరాం,  2 టౌన్ సీఐ గా జి సత్యనారాయణను బదిలీ చేశారు. ప్రస్తుత రూరల్ సీఐ వీరబాబు, 2 టౌన్ సీఐ నాగార్జునను మల్టీజోన్ 2 IG ఆఫీస్ కు అటాచ్ చేసినట్లు ప్రకటన విడుదల చేశారు.  తాజాగా ఇవాళ (మంగళవారం) మరో ముగ్గురు సీఐలను బదిలీ చేయడం గమనార్హం.