Good Health:రోజూ 3 కప్పుల బ్లాక్ కాఫీ.. షుగర్ కంట్రోల్.. గుండె జబ్బులకు చెక్..!

Good Health:రోజూ 3 కప్పుల బ్లాక్ కాఫీ.. షుగర్ కంట్రోల్.. గుండె జబ్బులకు చెక్..!

క్రమం తప్పకుండా తగు మోతాదులో కాఫీ తాగే వారికి మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఇటీవల జరిపిన పరిశోధనలు చెబుతు న్నాయి. రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా 200-300mg కెఫిన్ తాగడం వల్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చంటున్నారు. తగు మోతాదులో కాఫీ తాగమని ప్రజలను ప్రోత్స హించడం ద్వారా కార్డియోమెటబాలిక్ వ్యాధులను నివారించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 

టైప్ -2 డయాబెటిస్, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు అవసరమైన కెఫిన్ గురించి అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయం వెల్లడైంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండో క్రినాలజీ, మెటబాలిజంలో ఈ పరిశోధనకు సంబంధించిన ఆర్టికల్ ప్రచురించారు. కొత్త పరిశోధన ప్రకారం.. కాఫీ, కెఫిన్ వినియోగం అనేక గుండె సంబంధిత , జీవక్రియలకు సంబంధించిన వ్యాధుల నుంచి రక్షించబడుతుంది. 

క్రమం తప్పకుండా తగు మోతాదుతో కాఫీ లేదా కెఫిన్ తీసుకునే వ్యక్తుల్లో వివిధ రకాల కార్డియోమెటబోలిక్ వ్యాధులు(CM) డెవలప్ అయ్యే ప్రమాదం తక్కువ అని స్టడీలో తేలింది. గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, ఇన్సులిన్ అసమతుల్యత, ఆల్కహాలిక్ లేని కొవ్వు, కాలేయ వ్యాధి, రక్తపోటు, రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధులకు చెక్ పెడుతుందని అధ్యయనం చెప్తోంది. 

ఏ వయస్సు వారు ఎంత కాఫీ తాగాలి..?

రోజుకు 100 మిల్లీ గ్రాముల కెఫిన్ కంటే తక్కువ తినేవారు లేదా కాఫీ తాగని వ్యక్తులతో పోలిస్తే.. మితమైన మొత్తంలో అంటే రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా 200-300 మి.గ్రాముల కెఫిన్ తీసుకునే వారిలో  కార్డియోమెటబాలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదం 48 శాతం చాలా తక్కువ అని తేలింది. 

Also Read:-యువతలో మతిమరుపు రాకుండా మంచి చిట్కాలు..!

యూకె బయోబ్యాంక్ ప్రకారం..37నుంచి 73 యేళ్ల మధ్య వయసులో ఉన్న 5 లక్షల మందిని పరిశీలించగా డైలీ మూడు కప్పుల బ్లాక్ కాఫీ తాగిన వారిలో కార్డియోమెట బాలిక్ సమస్యలు తక్కువని తేలింది. 

బ్లాక్ కాఫీ ఎలా తయారు చేయాలి?

సింపుల్.. మనం సాధారణంగా కాఫీని పాలు, కాఫీ పొడి, చక్కెరతో తయారు చేస్తాం.. కానీ బ్లాక్ కాఫీని చక్కెర, పాలు లేకుండా..కేవలం కాఫీ పొడి లేదా కాఫీ గింజల ద్వారా బ్లాక్ కాఫీని తయారు చేసుకోవాలి.  

బ్లాక్ కాఫీ అంటే ఏమిటి? బ్లాక్ కాఫీ అనేది పాలు, చక్కెర, అదనపు పదార్థాలు లేని సాధారణ కాఫీ. కప్పు కాఫీలో ఈ అదనపు పదార్థాలను ఉంచకపోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడే కేలరీల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంట్లో బ్లాక్ కాఫీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

బ్లాక్ కాఫీ రెసిపీని సులభంగా తయారు చేసుకోవచ్చు

  • పాన్‌లో నీళ్లు తీసుకుని మరిగించాలి
  • ఇప్పుడు ఒక కప్పులో నీళ్ళు పోసి కొంచెం కాఫీ పౌడర్, బ్రౌన్ షుగర్ లేదా తేనె కలపండి
  • మీ అభిరుచికి అనుగుణంగా ఎక్కువ నీటిని జోడించవచ్చు. మీ బ్లాక్ కాఫీ రెసిపీ ఇప్పుడు సిద్ధంగా ఉంది. వేడిగా ఆస్వాదించడమే.