హైదరాబాద్, వెలుగు: మూడు డీఏలను వెంటనే విడుదల చేస్తూ, పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (జాక్టో) డిమాండ్ చేసింది. శనివారం కాచిగూడలోని ఎస్టీయూ ఆఫీసులో జాక్టో చైర్మన్ జి.సదానందం గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు డిమాండ్లపై చర్చించారు. మండలాల్లోని సీనియర్ హెడ్మాస్టర్లకు ఎంఈవోగా బాధ్యతలను అప్పగించాలన్నా రు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు.
కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైం స్కేలు ఇవ్వాలన్నారు. అన్ని మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యో గులు, టీచర్లు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సౌక ర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాక్టో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చైర్మన్‌గా జి.సదానందం గౌడ్, సెక్రటరీ జనరల్‌గా కృష్ణుడు, ట్రెజరర్‌గా జి.హేమచంద్రుడు, జనరల్ సెక్రటరీగా ఎండీ అబ్దుల్లాను ఎన్నుకున్నారు. కో చైర్మన్లుగా రాధాకృష్ణ, వెంకటేశ్వర రావు, చైతన్య, జయబాబు, అంజయ్య, అలీ బాబాలు, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా విఠల్, నజీరుద్దీన్, నగేశ్, గౌరవ సలహాదారులుగా పర్వతరెడ్డి, చెన్నయ్య, వేణుగోపా ల స్వామి, మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు.