![రాయికల్‌లో భీమేశ్వరస్వామి రథోత్సవం](https://static.v6velugu.com/uploads/2025/02/three-day-festival-at-bhimeshwara-swamy-temple-in-raikal-town-comes-to-a-close_g5J4Srjb6W.jpg)
రాయికల్, వెలుగు: రాయికల్పట్టణంలోని పురాతన భీమేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతర ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఆలయానికి ఉదయం నుండే భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాయికల్, మేడిపెల్లి, సారంగాపూర్, మల్లాపూర్, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తుల సమక్షంలో రథోత్సవం వైభవంగా సాగింది.
భక్తులు పోటీపడుతూ స్వామివారిని ఆలయం చుట్టూ తిప్పారు. రథం ముందు పూజరుల విన్యాసాలు అలరించాయి. అంతకుముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వంశీయులు దేవుని చిన్నరాజం, భీమన్న యూత్‌సభ్యులు, మున్నూరుకాపు యూత్ సభ్యులు జాతరలో ఏర్పాట్లు చేశారు.