పీయూలో ముగిసిన న్యాక్ పర్యటన

పీయూలో ముగిసిన న్యాక్  పర్యటన

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో మూడు రోజుల న్యాక్  టీం పర్యటన శనివారం ముగిసింది. పీయూ మెయిన్  క్యాంపస్ లోని పీజీ యూనివర్సిటీ, ఫార్మసీ కాలేజీ, కాలేజ్  ఆఫ్  ఎడ్యుకేషన్ తో పాటు పీయూ పరిధిలోని వనపర్తి, కొల్లాపూర్, గద్వాల పీజీ సెంటర్లను సందర్శించారు. పీయూలో ఏర్పాటు చేసిన ఎగ్జిట్  మీటింగ్ లో న్యాక్  చైర్మన్  రామశంకర్  దూబే మాట్లాడుతూ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, సాంస్కృతిక కార్యక్రమాల అలరించాయని, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు, సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపామని, 10 రోజుల్లో రిజల్ట్స్  వస్తాయని చెప్పారు.

 పీయూ వీసీ శ్రీనివాస్  మాట్లాడుతూ న్యాక్  బృందం సలహాలు, సూచనలు పాటిస్తామని, వచ్చే ఐదేండ్లలో పాలమూరు యూనివర్సిటీని రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామని తెలిపారు. అనంతరం న్యాక్  టీం మూడు రోజుల పర్యటన వివరాలను రిపోర్ట్​ రూపంలో వీసీ, రిజిస్ట్రార్ కు అందజేశారు. రిజిస్ట్రార్  చెన్నప్ప, కమిటీ సభ్యులు ఆశుతోశ్  కుమార్, అన్న స్వామి, నారాయణమూర్తి, కేకే అగర్వాల్, మలైదాసు, జయశ్రీ, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.