మూడు రోజులు పసుపు కొనుగోళ్లు బంద్

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 3 రోజులు పసుపు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్​ సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతర నేపథ్యంలో వ్యాపారులు, కమీషన్​ఏజెంట్లు, హమాలీ, దడవాయి, కూలీల విజ్ఞప్తి మేరకు  గురువారం, శుక్రవారం, శనివారం మార్కెట్ లో పసుపు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ మూడు రోజులు మార్కెట్ కు పసుపు తీసుకురావద్దని సూచించారు.