బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగానలో రానున్న మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 9,10న,11 తేదీల్లో తెలంగాణలో చాలా జిల్లాలలో ఉరుములు, ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.
సెప్టెంబర్ 8, 9, తేదీల్లో తెలంగాణలో కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 10 న రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
ALSO READ | Vijayawada Floods: ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు...కొట్టుకుపోయిన కారు..
కొమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ,ఖమ్మం,మహబూబాబాద్ జల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.