
ఆంధ్రప్రదేశ్: తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కమృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు కార్లలో కలిపి 11 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు దేవరపల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2024
విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు… pic.twitter.com/C48xYsOfY2