జమ్మూ కాశ్మీర్లో వానల బీభత్సం..విరిగిపడిన కొండచరియలు..ముగ్గురు సజీవ సమాధి

జమ్మూ కాశ్మీర్లో వానల బీభత్సం..విరిగిపడిన కొండచరియలు..ముగ్గురు సజీవ సమాధి

జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి. ఆదివారం(ఏప్రిల్20) తెల్లవారు జామున రాంబన్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వరదలుసంభవించాయి. నష్రీ, బనిహాల్ ప్రాంతాల మధ్య దాదాపు 12చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సమీప ప్రాంతాలు బురదల్లో చిక్కుకుపోయాయి. జమ్మూ, శ్రీగర్ హైవేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వరదల్లో ముగ్గురు మృతి చెందారు. దాదాపు 200 మందిని వరదలనుంచిరక్షించారు.  

రాంబన్‌లోని సెరి బాగ్నా లో మేఘాల విస్ఫోటనం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఈ వరద్లో అకిబ్ అహ్మద్ ,మొహమ్మద్ సాకిబ్ సహా ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మరికొందరు గల్లంతై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  SDRF బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. 
చంబా సేరిలో ముగ్గురు పిల్లలు వరదల్లో చిక్కుకున్నట్లు వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.CRPF ,స్థానిక పోలీసు సిబ్బంది,SDRF సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టాయి. 

►ALSO READ | ఢిల్లీలో కూలిన బిల్డింగ్..11 మంది మృతి.. మరో 11 మందికి గాయాలు.. 9 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి సొరంగం ముందు కొండచరియలు విరిగిపడటంతో సహాయ చర్యలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలతో నష్రీ బనిహాల్ మధ్య ప్రాంతం అత్యధికంగా ప్రభావితం అయింది. పంథియాల్ సమీపంలోని రోడ్డులో ఒక భాగం పూర్తిగా కొట్టుకుపోయింది. కాశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి, 250 కిలోమీటర్ల కీలకమైన హైవే వెంట వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. చిక్కుకుపోయిన వారందరినీ సురక్షితంగా తరలించారు. వాతావరణం మెరుగుపడి రోడ్డు పునరుద్ధరించబడే వరకు ప్రయాణికులు ఆ మార్గంలో వెళ్లకూడదని హెచ్చరించారు.