అమెరికాలో కాల్పుల మోత..ముగ్గురు టీనేజర్లు మృతి

అమెరికాలో కాల్పుల మోత..ముగ్గురు టీనేజర్లు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూ మెక్సికో స్టేట్ లో  రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ  ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన ముగ్గురు టీనేజర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసు వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికా కాలమాన ప్రకారం లాస్ క్రూసెస్ నగరంలోని యంగ్ పార్క్‌లో  మార్చి21 న రాత్రి సుమారు 10:00 గంటలకు కాల్పులు జరిగాయి. పర్మిషన్ లేని కార్ షోలో   రెండు గ్రూపుల మధ్య జరిగిన  వాగ్వాదం కాస్త  కాల్పులకు దారితీసింది. ఈ ఎదురు కాల్పుల్లో  ముగ్గురు మృతి చెందగా..చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ వారందరు 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వయసులో వారే  ఉన్నారు.  సంఘటనా స్థలంలో దాదాపు 50-60 బుల్లెట్ షెల్ కేసింగ్‌లు దొరికాయి.. దాదాపు 200 మంది పార్కులో ఉన్నారు.  ఎవరినీ అరెస్ట్ చేయలేదు అని లాస్ క్రూసెస్ పోలీసు చీఫ్ జెరెమీ స్టోరీ చెప్పారు.