AP : చెట్టును ఢీ కొట్టిన కారు.. స్పాట్లోనే ముగ్గురు డాక్టర్లు మృతి

AP : చెట్టును ఢీ కొట్టిన కారు.. స్పాట్లోనే ముగ్గురు డాక్టర్లు మృతి

ఏపీ అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. 

 బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  మృతులు బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ హాస్పిటల్ డాకర్లు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.