మూడేండ్లలో మూడు ఘట్టాలు : సీఎం రేవంత్

మూడేండ్లలో మూడు ఘట్టాలు : సీఎం రేవంత్
  •  అవి నా జీవితంలో మరువలేనివి: సీఎం రేవంత్
  • పీసీసీ చీఫ్​గా మూడేండ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి మూడేండ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఈ మూడేండ్లలో మూడు ఘట్టాలు జరిగాయని, అవి తన జీవితంలో మరువలేనివని అందులో పేర్కొన్నారు. ‘‘పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ  సారథ్యంలో విజయభేరీ సభ నిర్వహించడం, సీఎంగా బాధ్యతలు చేపట్టడం.. 

మూడేండ్లలో ఈ మూడు ఘట్టాలు నా జీవితంలో మరువలేనివి. నాడు నాపై ఎంతో నమ్మకంతో  ఈ బాధ్యతలు అప్పగించిన సోనియాగాంధీకి, కాంగ్రెస్ అగ్రనేతలందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రస్థానంలో నాకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలకు, పార్టీ అధికారంలోకి రావడానికి కఠోర శ్రమ చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు, కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా పాలనకు నాంది పలికిన నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు” అని సీఎం ట్వీట్ చేశారు. దీనికి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన, విజయభేరీ సభ, సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫొటోలు, వీడియోను జత చేశారు.