సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గరలోని ఓ హోటల్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హోటల్ యాజమాన్యం, పోలీసులు దగ్గరలోని యశోద ఆస్పత్రికి తరలించారు.
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చెందిన నారాయణ (52), పద్మావతి (47 )అనే దంపతులు తమ కొడుకు సృజన్ (23) కి 2024 ఫిబ్రవరి 14న పెళ్లి చేశారు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్ లో ఇటీవల కోడలు కావ్య అత్తామామలపై ఫిర్యాదు చేసింది. దీంతో కోడలు తమపై కేసులు పెట్టి వేధిస్తోందని సికింద్రాబాద్ లోని ఓ హోటల్ గదిలో జ్యూస్ లో మత్తుపదార్డం కలిపి ముగ్గురు తాగారు.గమనించిన హోటల్ సిబ్బంది యశోద ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.