ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నూతనంగా నిర్మించిన అయోధ్య రామమందిరం దగ్గర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం (మార్చి 10)న రామమందిర దర్శనానికి వచ్చిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దర్శనానికి ముందు స్నానం ఆచరించడానికి సరయూ నదిలో దిగిన వారు నీట మునిగి మరణించారు. మృతులు ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రవి మిశ్రా(20), హర్షిత్ అవస్థి(18), ఏళ్ల ప్రియాంషు సింగ్(16) లుగా గుర్తించారు.
నీటిలో ముగిపోయిన వారిని సాటి భక్తులు గమనించి కాపాడటానికి ప్రతయ్నం చేశారు. వారిని బయటకు తీసుకువచ్చి హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్లుగా డాక్టర్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగినాథ్ ఆదిత్య ఈ ఘటనపై స్పందించి మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు.
ALSO READ :- హీరోయిన్‌కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం