గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ డివిజన్ పరిధిలోని హుజూర్ నగర్, నడిగూడెం, గరిడేపల్లి పరిధిలో అక్రమంగా గంజాయి రవాణాచేస్తున్న మూడు ముఠాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 22 కేజీల గంజాయి, ఒక కారు 4 సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం ఏడుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. 

గంజాయి అక్రమ రవాణా సూత్రధారి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.