ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

హనుమకొండ సిటీ, వెలుగు : గంజాయిని   సరఫరా చేస్తున్న  ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు   ఏసీపీ  దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ పోలీస్​ స్టేషన్ లో ఏసీపీవివరాలు వెల్లడించారు.  హనుమకొండ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన జన్ను మనోహర్​, సిటీకి చెందిన మరో ఇద్దరు చిన్నాల సాయి కిరణ్​, కత్తుల శివశంకర్  గంజాయికి అలవాటు పడ్డారు.  ఈక్రమంలో ఇతర ప్రాంతాలనుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈనెల 11న ఎస్ఐ సతీశ్​ నిఘా వేసి పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.