
హనుమకొండ, వెలుగు : గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను వరంగల్ టాస్క్‌ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ శివనగర్‌కు చెందిన ఖమ్మంపాటి సుమంత్ కరీంనగర్‌లో ఉంటూ కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ శివనగర్‌కు చెందిన పాకాల సాయికుమార్, ములుగు వికాస్‌తో కలిసి గంజాయి దందా చేస్తున్నాడు. వీరు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి నగరంలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ముగ్గురూ ఖిలా వరంగల్‌లోని రాతికోటకు వస్తున్నట్లు సమాచారం అందుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల విలువైన 3 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.