శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో డ్యామ్ గేట్లను ఎత్తారు అధికారులు. మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పది అడుగుల మేర గేట్లను ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు . 55 వేల 605 క్యూసెక్కులు క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 6744క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నట్లు సమాచారం. 6, 7, 8వ గేట్లను ఎత్తారు అధికారులు. ఒక్కో గేటు నుండి 27వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందని తెలిపారు అధికారులు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 135.7816టీఎంసీలు టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 512.40అడుగులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. డ్యామ్ నీటి విడుదల దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇరిగేషన్ అధికారులు.
ALSO READ | Telangana: రైతులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్