మెగా డాటర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక(Niharika) తన యాంకరింగ్ తో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. తన అల్లరి మాటలు, చిలిపి చేష్టలతో షోకే కొత్త డైమెన్షన్ తీసుకొచ్చారు. చిన్నప్పటినుండి నటన అనే ఇష్టం ఉన్న నిహారిక తరువాత కొన్నాళ్ళకు యాంకరింగ్ మానేసి నటిగా ఒక మనసు సినిమాతో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. ఆ తరువాత కూడా ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో నిర్మాణ రంగంలోకి దిగారు నిహారిక.
ప్రస్తుతం ఓపక్క నిర్మాతగా, నటిగా చేస్తూనే మరోసారి యాంకరింగ్ చేయడానికి సిద్ధమయ్యారు నిహారిక. ప్రముఖ ఓటీటీ సంస్థలో కుకింగ్ ప్రోగ్రాం చేస్తున్నారు నిహారిక. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు.. ఈమధ్య నాకు తిండిపిచ్చి బాగా ఎక్కువైంది. పప్పుచారు అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ చేయడం కూడా చాలా ఇష్టం. దానికోసం డబ్బులు దాచుకుంటున్నాను. నేను ఏదీ ప్లాన్ ప్రకారం చేయను. ఆ టైంకి ఏది చేయాలనిపిస్తే అది చేయడమే. నటన అంటే నాకు చాలా ఇష్టం. కానీ, కమర్షియల్ సినిమా అవకాశాలు రాలేదు. వస్తే కచ్చితంగా చేసేదాన్ని.
మాది ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబం నేనెందుకు ఆడిషన్స్ ఇవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. నిజం చెప్పాలంటే నాకు ఆడిషన్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం నేను ఒక వంటల ప్రోగ్రాం చేస్తున్నాను. ఆ షోకి మా నాన్నమ్మ, మమ్మీ సురేఖ, వదిన ఉపాసనను తీసుకొచ్చి వారితో వంట చేయించాలని అనుకుంటున్నాను. అది జరుగుతుందా అనేది చూడాలి.. అంటూ చెప్పుకొచ్చారు నిహారిక. [ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.