లింగంపల్లిలో మూడు గుడిసెలు దగ్ధం

లింగంపల్లిలో మూడు గుడిసెలు దగ్ధం

గచ్చిబౌలి, వెలుగు: లింగంలపల్లి రైల్వేస్టేషన్​ సమీపంలోని మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్​సమీపంలో రోడ్డు పక్కన కొందరు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. బుధవారం సాయంత్రం ఒక గుడిసెలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న రెండు గుడిసెలకు వ్యాపించాయి. సామాగ్రితోపాటు మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు, గుడిసె వాసులు బిందెలు, బకెట్లతో నీటిని తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు.

గ్యాస్ ​రీఫిల్లింగ్​ చేస్తుండగా పేలుడు.. 

జీడిమెట్ల: అక్రమంగా గ్యాస్​ రిఫిలింగ్​చేస్తుండగా పేలుడు సంభవించి రెండు షాపులు దగ్ధమయ్యాయి. జీడిమెట్ల సబ్​స్టేషన్ నుంచి దూలపల్లికి వెళ్లే రోడ్డులో అయ్యప్ప కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా గ్యాస్​ఫిల్లింగ్​సెంటర్​ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున గ్యాస్​సిలిండర్స్​నిల్వచేసి చిన్న సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నారు. బుధవారం సాయంత్రం గ్యాస్​రీఫిల్లింగ్​చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇద్దరికి గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి ఆ పక్కనే ఉన్న శ్రీరామ్​సైకిల్ షాప్​తగలబడింది. గోడలు కుప్పకూలాయి. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

కైత్లాపూర్​లో టీ షాపు.. 

కూకట్​పల్లి: కూకట్​పల్లి కైత్లాపూర్​గ్రౌండ్​వద్ద ఉన్న టీ టైమ్​షాపులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్​లీకై మంటలు చెలరేగాయి. రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగింది.