సంక్షోభంలో హర్యానా ప్రభుత్వం.. కాంగ్రెస్ లోకి ముగ్గురు ఇండిపెండెంట్లు

సంక్షోభంలో హర్యానా ప్రభుత్వం..  కాంగ్రెస్ లోకి ముగ్గురు ఇండిపెండెంట్లు

లోక్‌సభ ఎన్నికల మధ్య హర్యానాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గోలెన్, ధరంపాల్ గోండార్)బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుని కాంగ్రెస్ లో చేరారు.  హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో రోహ్‌తక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.  

ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిగా ఉన్నామని, అందుకే తాము బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు.  దీంతో అక్కడి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. కాగా   90 మంది సభ్యులన్న హర్యానా అసెంబ్లీలో ఎన్టీఏకు 42 (బీజేపీ 40, హెచ్ఎల్పీ 1, ఇండిపెండెంట్ 1)ఉన్నారు.  నయాబ్ సైనీ ప్రభుత్వంలో ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.  మేజిక్ ఫిగర్ కు ఇంకా 4 సీట్లు కావాల్సి ఉంది.