
న్యూఢిల్లీ: ఇండియా బాక్సర్లు మనీష్ రాథోర్, హితేశ్, అభినాష్ జమ్వాల్.. వరల్డ్ కప్ బాక్సింగ్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. బ్రెజిల్‌లో గురువారం (April 3) జరిగిన మెన్స్ 65 కేజీల క్వార్టర్స్‌లో అభినాష్ ఏకగ్రీవంగా డెనిస్ బ్రిల్ (జర్మనీ)పై గెలిచాడు. 70 కేజీల్లో హితేశ్ కూడా అదే తరహాలో గాబ్రియేల్ గైడి రోంటాని (ఇటలీ)ను చిత్తు చేశాడు.
55 కేజీల క్వార్టర్స్‌లో మనీష్.. యూసుఫ్ చోతియా (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. మూడు రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన బౌట్‌లో ఇండియన్ బాక్సర్ పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురు జడ్జిలు ఏకగ్రీవంగా మనీష్‌ను విన్నర్‌గా ప్రకటించారు. ఇందులో ఇద్దరు జడ్జిలు సమాన పాయింట్లు ఇచ్చారు.