వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం
సింగపూర్: మన దేశ మూలాలున్న ముగ్గురు సింగపూర్ వాసులు.. ఆ దేశ పార్లమెంట్ ఎంపీలుగా నామినేట్ అయ్యారు. సింగపూర్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యుడు నీల్ పరేఖ్ నిమిల్ రజనీకాంత్(60), ప్లూరల్ ఆర్ట్ మ్యాగజైన్ కో ఫౌండర్, ట్యాక్స్ లాయర్ చంద్రదాస్ ఉషా రాణి(42), నాన్యాంగ్ బిజినెస్ స్కూల్‌లో కోర్స్ కోఆర్డినేటర్, లాయర్ రాజ్ జాషువా థామస్(43) నామినేటెడ్ పదవులకు ఎంపికయ్యారు. నామినేటెడ్ ఎంపీ స్థానాలకు మొత్తం 30 మంది పేర్లను పరిశీలించిన సెలెక్ట్ కమిటీ 9 మందిని ఎంపిక చేసిందని, అందులో మన దేశ సంతతికి చెందినోళ్లు ముగ్గురున్నారని అక్కడి మీడియా తెలిపింది. కాగా, వీళ్లను ఈ నెల 24న సింగపూర్ ప్రెసిడెంట్ హలీమా యాకోబ్ నియమించనున్నారు. ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరు రెండున్నరేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
ALSO READ:సీపీఎస్ రద్దుపై సప్పుడు లేదు.. ఆందోళనలో ఉద్యోగులు, టీచర్లు