
న్యూఢిల్లీ: ఈ వారం మూడు ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రాబోతున్నాయి. మరో 6 కంపెనీల షేర్లు మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి.
1. క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ ఐపీఓ ఈ నెల 3న ఓపెన్ కానుంది. 5 న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.129–136 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతున్నారు. కంపెనీ ప్రమోటర్లు ఈ పబ్లిక్ ఇష్యూలో 95.7 లక్షల షేర్లను అమ్మనున్నారు.
2. మెజంటా లైఫ్‌కేర్, సాట్రిక్స్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఎస్ఎంఈ సెగ్మెంట్ నుంచి ఐపీఓకి వస్తున్నాయి. మెజంటా లైఫ్‌కేర్ పబ్లిక్ ఇష్యూ జూన్ 5 ఓపెన్ అవుతుంది. 7న ముగుస్తుంది. ఈ కంపెనీ ఒక్కో షేరుని రూ.35 చొప్పున అమ్మనుంది. మొత్తం రూ.7 కోట్లు సేకరించాలని మెజంటా లైఫ్‌కేర్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు సాట్రిక్స్ ఇన్‌ఫర్మేషన్ ఎస్‌ఎంఈ ఐపీఓ కూడా జూన్5–7 మధ్య ఓపెన్‌లో ఉంటుంది. ఒక్కో షేరుని రూ.121 ధరకు కంపెనీ అమ్మనుంది.
3. విలాస్ ట్రాన్స్‌కోర్ షేర్లు ఈ నెల 3 ఎన్‌ఎస్‌ఈ ఎమెర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్టింగ్ కానున్నాయి. బీకన్ ట్రస్టీషిప్, జెడ్‌టెక్ ఇండియా షేర్లు జూన్ 4న లిస్టింగ్ కానుండగా, అసోసియేటెడ్ కోటర్స్ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో జూన్ 6 న లిస్టింగ్ కానుంది. అమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఈ నెల 6న , టీబీఐ కార్న్ ఈ నెల 7 న ఎన్‌ఎస్‌ఈ ఎమెర్జ్‌లో బోణి చేయనున్నాయి.