హైదరాబాద్లో జ్యూస్ సెంటర్లు యమ డేంజర్..అక్కడ జ్యూస్ తాగారంటే అంతేసంగతులు 

హైదరాబాద్లో జ్యూస్ సెంటర్లు యమ డేంజర్..అక్కడ జ్యూస్ తాగారంటే అంతేసంగతులు 

ఎండాకాలం.. మండే ఎండలు.. పదినిమిషాలు బయట తిరిగితే చాలు..ఒళ్లు మండిపోతుంది..డీహైడ్రేషన్ తో శరీరం అలసిపోతుంది..ఇలాంటి టైంలో ఏదో ఒకటి తాగాలని ఉంటుంది..రోడ్లపై కనిపించే జ్యూస్ సెంటర్ల దగ్గర వెళ్లి ఏదో ఒక జ్యూస్ తాగుతుంటాం. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాణ్యతలేని ఫుడ్ ఎలా అమ్ముతున్నాయనుకున్నాం. కానీ జ్యూస్ సెంటర్లలో కూడా పరిశుభ్రత లేని, ఆహార భద్రత నిబంధనలకు విరుద్ధంగా జ్యూస్ సెంటర్లు నిర్వహిస్తూ పాడైపోయిన పండ్లతో జూస్ అమ్ముతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఇలాంటి జ్యూస్ సెంటర్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు.

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జ్యూస్ సెంటర్లపై గురువారం (మార్చి27) దాడులు నిర్వహించారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గచ్చిబౌలిలోని మూడు జ్యూస్ సెంటర్లపై ఆహార భద్రతా విభాగం అధికారులు సీజ్ చేశారు. మిలన్ జ్యూస్ సెంటర్, బిస్మి మ్యాగీ,జ్యూస్ సెంటర్, సిప్ ,స్నాక్ అనే జ్యూస్ సెంటర్లను పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘిం,చినందుకు సీజ్ చేశారు. 

ALSO READ | రెస్టారెంట్లకు దిల్లీ హైకోర్టు షాక్.. సర్వీస్ ఛార్జీలపై కీలక ఆదేశాలు

మిలన్ జ్యూస్ సెంటర్ లో గడువు ముగిసిన బనానా క్రష్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ సిరప్, ప్యాషన్ ఫ్రూట్ సిరప్ లను సీజ్ చేశారు. ఫ్రిజ్ లోని పరిశుభ్రంగా లేని ఆహార పదార్థాలు, సెంటర్ లోపల అంతా వ్యర్థాలతో నిండివున్నట్లు గుర్తించారు. బిస్మి మ్యాగీ సెంటర్‌కు FSSAI రిజిస్ట్రేషన్ లేదు. రిఫ్రిజిరేటర్‌లోని ఆహార పదార్థాల తెగులు నియంత్రణ రికార్డులు, నీటి విశ్లేషణ నివేదికలు లేవు. తొక్క తీసిన పండ్లు కుళ్ళిన స్థితిలో కనిపించాయి.ఈ సెంటర్లో బొద్దింకల బెడద, ఈగలు,ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఉద్యోగులు హెడ్ గేర్ ,ఆప్రాన్ ధరించలేదు. నేలపై ,రిఫ్రిజిరేటర్ లోపల ఆహారం చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. 

సిప్ అండ్ స్నాక్ సెంటర్ కు FSSAI లైసెన్స్ లేదు. ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు సపోటాలు, నారింజ పండ్లు చెడిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ గచ్చిబౌలి జ్యూస్ సెంటర్‌లో కూడా హౌస్‌ఫ్లై బెడద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గచ్చిబౌలిలోనిఈ మూడు జ్యూస్ సెంటర్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు.