ప్ర‌మాద స్థ‌లిని ప‌రిశీలిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

ప్ర‌మాద స్థ‌లిని ప‌రిశీలిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి వద్ద ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. కారు, లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత కారు బైక్‌ను ఢీకొనడంతో రాజశేఖర్ అనే యువకుడు దుర్మరణం చెందారు. ఘటనస్థలిని పరిశీలిస్తున్న వారిపై మరో లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులను రాజశేఖర్, శ్రీనివాస్, శివమ్మలుగా గుర్తించారు. క్షతగాత్రులను బత్తలపల్లి ఆసుపత్రికి తరలించారు