
న్యూయార్క్: అమెరికా న్యూయార్క్‌లో ఉన్న బౌద్ధ ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బౌద్ధ సన్యాసితో పాటు ఇద్దరు మృతి చెందారు. న్యూయార్క్ సిటీలోని బ్రాంక్స్ ప్రాంతంలో ఉన్న ఆలయంతో పాటు ఆ పక్కనున్న రెండు భవనాల్లో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
రాత్రి సమయంలో రూమ్ హీటర్ పక్కన బట్టలు ఉండటంతో.. ఆ వేడికి వాటికి నిప్పంటుకొని మంటలు చెలరేగాయని వెల్లడించారు. మంటలు చెలరేగిన సమయంలో మెట్ల కింద ఓ బౌద్ధ సన్యాసి ప్రార్థన చేస్తున్నారు. మంటలను గమనించిన వెంటనే అందరిని అలర్ట్ చేసి, బయటకు పంపించారు.
ఈ క్రమంలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మంటలు చాలా స్పీడుగా టెంపుల్‌కు ఆ పక్కనే ఉన్న రెండు రెసిడెన్షియల్ భవనాలకు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు.