అశ్వారావుపేట ముత్యాలమ్మ తల్లి జాతరకు పోటెత్తిన భక్తులు

అశ్వారావుపేట ముత్యాలమ్మ తల్లి జాతరకు పోటెత్తిన భక్తులు
  • మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ 

అశ్వారావుపేట, వెలుగు: మండల  పరిధిలోని  చిలకల గండి ముత్యాలమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు. ఈనెల 27 నుంచి కొనసాగుతున్న జాతరకు ఆదివారం రాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో  చేరుకున్నారు. కుంభమేళాను తలపించేలా ఉండటంతో పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. 

అశ్వారావుపేట నుంచి వినాయకపురం వెళ్లే రోడ్డుపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సీఐ కరుణాకర్, ఎస్సైలు యయాతి రాజు, రామ్మూర్తి ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. జాతరకు వచ్చే వాహనాలను ఊట్లపల్లి వద్దే ఆపేశారు. సోమవారం చివరి రోజు కావడంతో అమ్మవారు తలుపులమ్మ తల్లి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.