భద్రాచలం: చత్తీస్గఢ్ లో జనవరి 12న ఉదయం ఎస్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.
అనంతరం పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లారిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), సీఆర్పీ ఎఫ్బృందాలు ఈ ఎన్ కౌంటర్లో పాల్గొన్నాయని సుక్మా కిరణ్ చవాన్ తెలిపారు. నేషనల్ పార్క్ పరిధి లోని అడవుల్లో బలగాలు కూంబింగ్ కొనసాగుతోం దని.. కాల్పులు ఇంకా జరుగుతున్నాయని చెప్పారు.
ALSO READ | 8 నెలలుగా ఫ్రిజ్లోనే డెడ్ బాడీ..లివ్ ఇన్పార్ట్నర్ను చంపిన యువకుడు