జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు : ఎస్పీ యోగేశ్​గౌతమ్

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు : ఎస్పీ యోగేశ్​గౌతమ్

నారాయణపేట, వెలుగు : జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బు సంపాదించానే కోరికతో ముగ్గురు యువకులు చోరీలకు అలవాటు పడ్డారని ఎస్పీ యోగేశ్​గౌతమ్​ తెలిపారు. కోస్గి, మద్దూర్​మండలాల్లో 9 చోరీ కేసుల్లో నిందితులు, రికవరీపై ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గండీడ్​మండలం చిన్న వార్వాల్​గ్రామానికి చెందిని గడ్డమీది రామకృష్ణ, నంచెర్ల శ్రీను, సాలనగర్​ గ్రామానికి చెందిన గజ్జి రమేశ్ జల్సాలకు అలవాటుపడ్డారు.

సోమవారం కోస్గిలో పోలీసులు నాకాబందీ చేస్తుండగా శివాజి చౌక్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా చోరీల విషయాన్ని వారు వెల్లడించారు. గతేడాది మద్దూర్​మండలం కేంద్రంలోని ఓ బంగారు షాప్​యాజమాని వద్ద వెండి వస్తువులున్న బ్యాగ్​ను దొంగిలించారు. కోస్గి పట్టణంలో మోటర్​వైండింగ్​షాప్​లో 4 బోర్​మోటార్లు

వైర్​బండల్స్, 8 సీలింగ్​ఫ్యాన్లు, కోస్గిలోని ఓ గుడిలో హుండీ డబ్బు, గోల్డ్​సోక్​షాప్ లో 2 తులాల నెక్లెస్, మున్సిపల్​కార్యాలయంలో 3 బ్యాటరీలు, ఓ స్కూల్​లో టీవీ, ప్రింటర్ వంటి వస్తువులు చోరీ చేశారు. మొత్తం రూ.9.7 లక్షల విలువ చేసే వస్తువులు, డబ్బు రికవరీ చేసినట్టు తెలిపారు.ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.