ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని ప్రముఖ హాస్పిటల్ మేనేజ్మెంట్ను బెదిరిస్తున్న యూట్యూబ్ఛానెల్కు చెందిన ముగ్గురిని వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ హాస్పిటల్ ప్రతి సంవత్సరం 5 లక్షలు తమ యూట్యూబ్ఛానెల్కు యాడ్ ఇవ్వాలని, లేకపోతే హాస్పిటల్‌కు వ్యతిరేకంగా కల్పిత వార్తలను అప్లోడ్ చేస్తామని
ఓ యూట్యూబ్ ఛానల్ కు చెందిన పుచ్చకాయల ప్రకాశ్, అత్తులూరి రామకృష్ణ అలియాస్ రాంకీ, అసిస్టెంట్ కెమెరామెన్ షేక్ బాబా బెదిరిస్తున్నారు. ఈ విషయమై హాస్పిటల్ మేనేజ్మెంట్ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వారి ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.