ముగ్గురి ప్రాణం తీసిన ట్రిపుల్ రైడింగ్

వేగంగా వస్తున్న మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా  ఐనవోలు  మండలం వద్ద జరిగింది ఈ ఘటన. మృతి చెందిన వారు వాగ్దేవి కాలేజీ కి చెందిన ఆదిత్య, సాయి చరణ్, రాం సాయి గా గుర్తించారు. వీరిలో ఒకరు వర్ధన్న పేట మున్సిపాలిటీలో పనిచేసే బిక్కినేని వెంకట్రావు కుమారుడిగా తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.