మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలి ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందారు. గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామంలో మంగళవారం అర్దరాత్రి ఈ ఘటన జరిగింది. మృతులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంటి పై కప్పు కూలి పడింది. దాంతో శరణమ్మ (38), ఆమె ఇద్దరు కూతుళ్లు భవాని (13), వైశాలి (9) మృతి చెందారు. ఈ ప్రమాదంతో కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఆర్డీవో శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
For More News..