గోడ కూలి ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి గాయాలు

గోడ కూలి ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి గాయాలు

నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. వర్నిమండలం తగెలేపల్లిలో ఇంట్లోని వరండా గోడ కూలి ముగ్గురు మృతిచెందారు. కామారెడ్డికి చెందిన శ్రీను.. తన బార్య, పిల్లలతో కలిసి వలస వచ్చి ఇక్కడ జీవిస్తున్నాడు. వీరంతా గురువారం రాత్రి ఎప్పటిలాగే తిని ఇంటి వరండాలో పడుకున్నారు. శుక్రవారం ఉదయం 5:30 గంటలకు వరండాలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలి వీరిపై పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మి, కుమారుడు కన్నా అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీను మరియు మరో ముగ్గురు పిల్లలు సంజన, వైష్ణవి, పండులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను కూడా మరణించాడు.

వీరు ఉంటున్న ఇంట్లో వరండాలో రేకులు వేయాలని పునాదులు లేకుండా గోడలు కట్టి వదిలేశారు. ఆ గోడలే వీరి మరణానికి కారణమయ్యాయి. శ్రీను కుటుంబానికి గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు అయిందని.. అయితే శ్రీను లంచం ఇవ్వలేదని మంజూరయిన ఇంటిని రద్దు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

For More News..

మారటోరియం గడువు మరో మూడు నెలలు పెంచిన ఆర్బీఐ

24 గంటల్లో 6వేలకు పైగా కరోనా కొత్త కేసులు

బాలిక శవంతో శృంగారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి

స్వామి గౌడ్ మృతిపట్ల కిషన్ రెడ్డి సంతాపం