- డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో షేరింగ్
- సీఐడీ సమాచారంతో కటకటాల్లోకి యువకులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: చైల్డ్పోర్న్డౌన్లోడ్చేయడమే కాకుండా ఇన్ స్టా, స్నాప్ చాట్ లో షేర్ చేస్తున్న ముగ్గురు సిటీ యువకులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్చిల్డ్రన్ పోర్టల్ నుంచి సీఐడీకి సమాచారం రావడంతో వారు సిటీ సైబర్క్రైమ్ను అలర్ట్చేశారు.
రెండు రోజుల కిందట నిందితులను అరెస్ట్ చేయగా, వీరిలో 25, 32 ఏండ్ల ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, 26 ఏండ్ల ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరు చైల్డ్ పోర్నోగ్రఫీని వివిధ వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నట్లు గుర్తించారు.
అంతేకాకుండా స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ కు షేర్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఐపీ అడ్రస్, మొబైల్ ఫోన్ నంబర్స్, ఇతర టెక్నికల్డేటా ఆధారంగా వీరు ముగ్గురు నేరానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. చైల్డ్పోర్న్క్రియేట్చేసే వారితోపాటు చూస్తున్నవారు, షేర్చేసేవారి సమాచారం ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని సైబర్క్రైమ్స్డిప్యూటీ కమిషనర్కోరారు.