భద్రాద్రి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్య.. ఎందుకంటే,,

 భద్రాద్రి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్య.. ఎందుకంటే,,
  • లవ్ ఫెయిలై ఒకరు..

మణుగూరు, వెలుగు: లవ్ ఫెయిలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. సీఐ సతీశ్​కుమార్ తెలిపిన ప్రకారం.. మణుగూరు మండలం వాసవి నగర్ గ్రామానికి చెందిన సుగ్గుల కార్తీక్(27) కు సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది. ప్రేమగా మారి పెండ్లి చేసుకునేదాకా వెళ్లింది. కొద్దిరోజుల కింద ఆ యువతి పెండ్లికి నిరాకరించడంతో కార్తీక్ మనస్తాపం చెందాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. తండ్రి సుదర్శన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

తల్లిదండ్రులు మందలించగా మరొకరు..

ములకలపల్లి : మద్యానికి బానిసైన కొడుకును తల్లిదండ్రులు మందలించడంతో సూసైడ్ చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.  పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ములకలపల్లి మండలం గుట్టగూడెం గ్రామానికి చెందిన గుండె అర్జున్ కొడుకు చైతన్య(19) చదువుకుని ఇంటివద్ద ఖాళీగా ఉంటూ మద్యానికి అలవాటు పడి ఏ పని చేయడంలేదు. తల్లిదండ్రులు కొడుకును మందలించారు. దీంతో మనస్తానం చెందిన అతను సోమవారం ఇంటికి సమీపంలో చెట్టుకు తెల్లవారుజామున ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

మద్యం తాగొద్దని భర్త అన్నందుకు..  

పాల్వంచ:  మద్యం తాగొద్దని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పాల్వంచ రూరల్ ఏఎస్ఐ సుధాకర్ తెలిపిన ప్రకారం.. పాల్వంచ మండలం సారెకల్లుకు చెందిన మడకం రాజి(21) కూలి పనులు చేస్తుంది. ఆమె కొన్నాళ్ల కింద రామును రెండో పెండ్లి చేసుకుంది. భార్య కొంతకాలంగా ఫుల్ గా మద్యం తాగుతుండగా  గత శుక్రవారం భర్త మందలించగా అదేరోజు పురుగుల మందు తాగింది. వెంటనే ఆమె