ఘట్కేసర్, వెలుగు: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కనిపించకుండా పోయారు. ఈ ఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడలోని శాంతినగర్‌కు చెందిన ఆశల మోహన్‌కు చందన (21)తో 2023లో వివాహమైంది. చందన తండ్రి వెంకటరామారావు(47) అన్నోజిగూడలో ఉంటూ ఇన్ఫోసిస్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
తల్లి సుధారాణి(45) గృహిణి. ఆరోగ్యంగా బాగోలేకపోవడంతో చందన ఈ నెల 14న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు చందన ఫోన్స్విచ్ఛాఫ్వస్తున్నాయి. అనుమానంతో ఈ నెల 15న మోహన్అన్నోజిగూడలోని అత్తగారి ఇంటికి వచ్చి చూశాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో తెలిసిన వారి వద్ద వెతికాడు. ఆచూకీ దొరకకపోవడంతో సోమవారం పోచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.