ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది.. రేణిగుంట కడప హైవేపై ఓ కారు ప్రైవేటు బస్సును దీక్నడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సోమవారం ( జనవరి 20, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకొని కారులో తిరిగి వస్తుండగా రేణిగుంట, కడప హైవేపై ఓ ప్రైవేటు బస్సును కారు ఢీకొంది.. ఈ ఘటనలో సందీప్, భార్య అంజలి దేవి సహా కూతురు కూడా మరణించారు.
కారు వేగంగా వచ్చి బస్సును ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సందీప్ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.