- మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఈ కమిటీ చైర్మన్‌గా, సభ్యులుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య సభ్యులుగా ఉంటారు. ఆర్టీసీలో విధుల్లో ఉన్న ఉద్యోగులపై గతంలో సర్వీస్ రిమూవల్, తదితర పాలనాపరమైన కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించిన ఉద్యోగులను ఈ త్రిసభ్య కమిటీ పిలిచి సమీక్షించి, ఆర్టీసీ యాజమాన్యానికి రిపోర్టు అందజేస్తుంది.