- ఆమె స్నేహితుడిపైనా దాడి చేసిన దుండగులు
పుణె: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి(21)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి పుణె శివారులోని బోప్‌దేవ్ ఘర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోఢ్వా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి, తన స్నేహితుడు కలిసి గురువారం రాత్రి బోప్‌దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లారు. రాత్రి 11 సమయంలో ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకొని యువతి స్నేహితుడిపై దాడి చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఇందుకోసం 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని జాయింట్ పోలీస్కమిషనర్రంజన్ కుమార్ శర్మ చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.