కేకే బిడ్డ గెలిచింది.. సుభాష్‌ రెడ్డి భార్య ఓడింది

కేకే బిడ్డ గెలిచింది.. సుభాష్‌ రెడ్డి భార్య ఓడింది

పీజేఆర్ కూతురు, మేయర్ భార్య గెలిచిన్రు
ముగ్గురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు ఓడిన్రు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి దిగిన రాజకీయ నేతల కుటుంబసభ్యుల్లో కొందరు గెలుపొందగా, మరికొందరు ఓడిపోయారు. అధికార పార్టీ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు బిడ్డ విజయలక్ష్మి బంజారాహిల్స్‌‌‌‌ డివిజన్‌‌‌‌లో, ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి చర్లపల్లి డివిజన్‌‌‌‌లో, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బంధువు జూపల్లి సత్యనారాయణ కూకట్‌‌‌‌పల్లి డివిజన్‌‌‌‌లో గెలిచారు. దివంగత నేత పీజేఆర్ కూతురు పి.విజయారెడ్డి ఖైరతాబాద్ డివిజన్ లో విన్ అయ్యారు.

పెద్ద లీడర్లకు షాక్…

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌​రెడ్డి భార్య, సిట్టింగ్​ కార్పొరేటర్ స్వప్న హబ్సిగూడ డివిజన్​లో ఓడిపోయారు. ముషీరాబాద్​ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ గాంధీనగర్​డివిజన్​లో, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ సోదరుడు ప్రేమ్ దాస్ గౌడ్ మైలార్​దేవ్ పల్లిలో ఓటమి పాలయ్యారు. దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్​రెడ్డి రాంనగర్​డివిజన్ లో, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సునరిత రెడ్డి మూసారాంబాగ్ డివిజన్ లో, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్​గౌడ్ గాజులరామారం డివిజన్ లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వెంగల్ రావు కుమారుడు గొట్టిముక్కల విశ్వ తేజేశ్వర్ కూకట్​పల్లి డివిజన్ నుంచి కాంగ్రెస్​తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

For More News..

గ్రేటర్​లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్

కొత్త రక్తం.. పక్కా వ్యూహం