బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలో బీఆర్కు మరో షాక్తగిలింది. ఇప్పటికే పలువురు మున్సిపల్కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరగా.. తాజాగా మరో ముగ్గురు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కౌన్సిలర్లు ఎలిగేటి సుజాత, తుంగపెల్లి సుజాత, పోలు ఉమాదేవి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరితోపాటు లీడర్లు ఎలిగేటి శ్రీనివాస్, తుంగపెల్లి గంగాదర్, పోలు శ్రీనివాస్, బైరి శంకర్, జంజిరాల మనోహర్, ఎస్కె ఖలీల్, ఎలిగేటి మల్లేశ్సహా దాదాపు 50 మంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన కాసిపేట ఎంపీపీ లక్ష్మి
బెల్లంపల్లి రూరల్: కాసిపేట మండల ఎంపీపీ రొడ్డ లక్ష్మి బీఆర్ఎస్ను వీడారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరగా ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే వినోద్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కాసిపేట మండల ఇన్చార్జి గడ్డం జగన్నాథం, మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, నాయకులు రాపర్తి శ్రీనివాస్, నర్సింగ్, రొడ్డ రవికుమార్ పాల్గొన్నారు.