రాంచీ: ఇండియాకు చెందిన మరో ముగ్గురు రేస్ వాకర్స్ టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డులు బద్దలు కొట్టిన సందీప్ కుమార్, ప్రియాంక గోస్వామి టోక్యో బెర్తు దక్కించుకున్నారు. రాహుల్ కుమార్‌కు కూడా బెర్త్ లభించింది. దాంతో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ఇండియా రేస్ వాకర్స్ సంఖ్య ఐదుకు చేరింది. కేటీ ఇర్ఫాన్ (మెన్స్ 20 కి.మీ.), భావనా జాట్(విమెన్స్ 20 కి.మీ.) ఇప్పటికే అర్హత సాధించారు. శనివారం జరిగిన మెన్స్ 20 కి.మీ. రేస్ వాక్‌ను 34 ఏళ్ల సందీప్ (హర్యానా) గంటా 20 నిమిషాల 16 సెకండ్లతో ముగించి విజేతగా నిలిచాడు. హర్యానాకే చెందిన రాహుల్ కుమార్ గంటా 20.16 నిమిషాలతో సెకండ్ ప్లేస్‌లో నిలిచి టోక్యో టికెట్ కైవసం చేసుకున్నాడు. ఇక, యూపీకి చెందిన ప్రియాంక విమెన్స్ ఈవెంట్‌ను గంటా 28.45 నిమిషాల టైమింగ్‌తో ఫినిష్ చేసి టైటిల్ నెగ్గింది.
For More News..