తెలంగాణలో మూడు కొత్త కేసులు.. 30కి చేరిన కరోనా బాధితులు

తెలంగాణలో మూడు కొత్త కేసులు.. 30కి చేరిన కరోనా బాధితులు

తెలంగాణలో కరోనా కేసులు 30కి చేరాయి. ఈ రోజు ఒక్కరోజే కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా బృందంతో తిరిగిన కరీంనగర్ వ్యక్తికి, ఫ్రాన్స్ నుంచి వచ్చిన హైదరాబాద్ వాసికి మరియు లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో తెలంగాణ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు. ఒక్కరోజులోనే మూడు కేసులు కొత్తగా నమోదుకావడంతో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. మార్చి 31 వరకు జనాలెవరూ రోడ్లమీదికి రావొద్దని హెచ్చరించారు.

దేశం మొత్తం మీద 415 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. కరోనా బారినపడి ఇప్పటివరకు ఏడుగురు మరణించారు.

For More News..

లాక్‌డౌన్ ఎఫెక్ట్: రోడ్డెక్కితే బండి సీజ్

కరీంనగర్‌లో కరోనా తొలి పాజిటివ్ కేసు

జిల్లాల వారీగా కరోనా పేషెంట్ల వివరాలివే

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం