సికింద్రాబాద్​కు 3, హైదరాబాద్​కు 4 

  •     మూడోరోజు కొనసాగిన నామినేషన్లు 

హైదరాబాద్/సికింద్రాబాద్/గండిపేట, వెలుగు : సికింద్రాబాద్ ​లోక్​సభ స్థానానికి శనివారం మూడు నామినేషన్లు వచ్చాయి. జైస్వరాజ్ పార్టీ అభ్యర్థిగా రాయపాటి శామ్యుయెల్, ఇండిపెండెంట్లుగా సిద్ధిఖీ అహ్మద్​ఖాన్, మహ్మద్ అబ్దుల్ అజీమ్ నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు మొత్తంగా 11 నామినేషన్లు వచ్చినట్లు సికింద్రాబాద్​లోక్​సభ రిటర్నింగ్​ఆఫీసర్​తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి శనివారం ఒక నామినేషన్​దాఖలైంది.

ఇండిపెండెంట్​గా దండెం రత్నం నామినేషన్​వేశారు. అలాగే హైదరాబాద్ లోక్​సభ స్థానానికి శనివారం 4 నామినేషన్లు వచ్చాయని రిటర్నింగ్ ఆఫీసర్ అనుదీప్​చెప్పారు. పులిపాటి రాజేష్ కుమార్(కాంగ్రెస్ పార్టీ), సయ్యద్ జామిల్(ఆధార్ పార్టీ), ఎల్వీఎల్ సుబ్బారావు(ఇండిపెండెంట్), గడ్డం హరీశ్(ధర్మ సమాజ్ పార్టీ)  నామినేషన్ వేసినట్లు తెలిపారు. 

చేవెళ్లకు ఆరు..

చేవెళ్ల లోక్‌‌సభ స్థానానికి శనివారం నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్‌‌ ఆఫీసర్ శశాంక తెలిపారు. రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్‌‌(సెక్యులర్‌‌) పార్టీ అభ్యర్థిగా మహమ్మద్‌‌ సలీం, స్వతంత్ర అభ్యర్థిగా ఒక్కొక సెట్​నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండ్లెంట్లుగా ఇసరి సూర్యప్రకాశ్​రెడ్డి, ఆంజనేయులు నీరటి, ప్రజా వెలుగు పార్టీ అభ్యర్థిగా టి.దుర్గాప్రసాద్‌‌, ధర్మ సమాజ్‌‌ పార్టీ అభ్యర్థిగా తోట్ల రాఘవేందర్ నామినేషన్‌‌ వేశారు. ఇప్పటి వరకు 12 నామినేసన్లు వచ్చాయని రిటర్నింగ్​ఆఫీసర్​తెలిపారు.